0487 2329000 devasthanam44@gmail.com Peringottukara, Thrissur

దేవస్థానంలో దర్శనీయ ప్రదేశాలు

Peringottukara Devasthanam

పెరింగొట్టుకర దేవస్థానాన్ని విష్ణమయ సంప్రదాయాలకనుగుణంగా ద్రవిడ నిర్మాణశైలిలో నిర్మించారు. ఎంతో నిష్ఠతో పూజాదికాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ కులమతాల ఆంక్షలేవి ఉండవు. పూజల్లో భక్తులు స్వయంగా పాల్గొని వాటిని ఆచరించి తమ కష్టాలనుంచి ఉపశమనం పొందవచ్చు. మిగిలిన ఆలయాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడు స్వామివారికి పూజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి, పూజల ముగింపు ఘట్టంలో విష్ణుమయుడు భక్తులకు దర్శనమిచ్చి వారి సమస్యలు ఆలకించి వాటికి పరిష్కారాలు చూపుతాడు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు స్వామివారికి అతి సమీపంలోకి వచ్చి ఆయన చెవుల్లో తమ సమస్యలు విన్నవించుకోవచ్చు. ఇక్కడి పూజారులు కూడా ఎంతో దయామయులు, సహనశీలురు. వారు కూడా ఎంతో సావధానంగా భక్తులు సమస్యలు, బాధలు ఆలకిస్తారు. స్వయంగా వచ్చి పూజలు చేయించుకోలేని భక్తుల కోసం ఇక్కడి పూజారులు చెప్పే మాటలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. స్వయంగా వచ్చి పూజాదికాలు నిర్వహించలేని భక్తులు పూజలకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించి ప్రసాదాలు అందుకోవచ్చు. విష్ణమయస్వామి, భువనేశ్వరి దేవి, బ్రహ్మరక్షసు ఆలయాల్లోనే కాకుండా ఉపాలయాల్లోనూ నిత్యపూజలు జరుగుతాయి. మహీష మండపం, పుణ్య పుష్కరిణి, భారీ దివ్యరథంలో కొలువుదీరిన బ్రహ్మండమైన విష్ణుమయ స్వామి విగ్రహం ఇక్కడి ఇతర ఆకర్షణలు.

పెరింగొట్టుకర దేవస్థానం ఆలయ ఆకృతి

att1
Peringottukara Devasthanam

విష్ణుమయస్వామి స్థూపం

att2

పురుషుడు, ప్రకృతి సంగమంతో పుట్టుకలు సంభవిస్తాయి. శివుడు పురుషుడైతే, పార్వతీదేవి ప్రకృతి. వారి అపూర్వకలుయికతో అద్భుతమైన శివతాండవం ముగుస్తుంది. కుడివైపున ఉండే దివ్య రథం ఈ విశ్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. శివపార్వతుల దివ్యసంగమంతో వాలంపిరి సంఖ్ నుంచి ఆవిర్భావించిన దైవాంశ సంభూతుడు విష్ణుమయస్వామి. 41 అడుగుల ఎత్తులో ఉండే ఈ భారీ మండపంలో శివపార్వతులు, విష్ణమయ స్వామి బ్రహ్మండమైన విగ్రహాలను తిలకించవచ్చు. ఇది దేవస్థానానికి ఎదురుగా ఉంటుంది.

సంగీత, నృత్య దక్షిణామూర్తి మండపం

att7

దేవస్థానంలోని దక్షిణామూర్తి మండపం ఎంతో ప్రముఖమైనది. ఇక్కడ ఎన్నో దివ్యమైన ప్రదర్శనలు జరుగుతుంటాయి. విష్ణుమయ స్వామి పరమభక్తుడైన సంగీత కళాకారుడు గౌరవార్థం ఈ మండపాన్ని నిర్మించారు. ఆలయాన్ని సందర్శించిన ప్రతీసారి ఆ సంగీత కళాకారుడు స్వామిపై పాటలు పాడేవారు. ఆ కారణంగానే ఈ దేవస్థానం ఆయన గౌరవార్థం ఈ మండపాన్ని నిర్మించింది. సంగీతకళాకారుడు దక్షిణామూర్తి జీవించి ఉన్నప్పుడే నిర్మించిన కట్డడం ఇది. ఆయన సమక్షంలోనే ఇక్కడ తొలి సంగీత ఉత్సవాన్ని నిర్వహించారు. అందులో మూడు తరాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ మండపంలోనే విష్ణుమయ మహాత్మ్యం, కథాకళి వంటివి ప్రదర్శిస్తారు. అంతే కాదు అమావాసి శాక్తేయపూజ ఇక్కడ నిర్వర్తిస్తారు.

Peringottukara Devasthanam

కళ్యాణ మండపం

att6

దేవస్థానం నిర్మించిన కళ్యాణ మండపంలో పేదకుటుంబాలవారు ఉచితంగా వివాహాలు నిర్వహించుకోవచ్చు.

ఉచిత వసతి

att3

భక్తులందరికి దేవస్థానం ఉచిత వసతి, భోజనం సమకూర్చుతుంది.

Peringottukara Devasthanam

దేవస్థానాల ఆకృతి

att5

దేవస్థానాల ఆకృతి

Call Now
× Whatsapp Us
Visit Us On FacebookVisit Us On Youtube