0487 2329000 devasthanam44@gmail.com Peringottukara, Thrissur

శ్రీ విష్ణుమయస్వామి

శాస్త, మురగ, విఘ్నేశ్వరుడి వంటి వాడే శివనందనుడైన ఈ విష్ణుమయస్వామి. సాధారణ ఫలితాలు కాకుండా ప్రత్యేకమైన ఫలితాలు కాంక్షించే భక్తులు ఈ స్వామిని కొలుస్తారు. విష్ణుమయస్వామి ఎంతో దయామయుడు,భక్తసులభుడని భక్తులు నమ్ముతారు. పెరింగొట్టుకర శ్రీ విష్ణుమయస్వామి లీలలు తెలుసుకుందాం. ఓసారి వేటకు వెళ్లిన మహాశివుడికి గిరిజన మహిళ కూలివాక కనిపిస్తుంది. ఆమె పార్వతీదేవి భక్తురాలు. గత జన్మలో ఆమె గణపతికి స్తన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ జన్మలో ఆమెకు శివనందనుడిని పెంచే మహాభాగ్యం లభిస్తుంది.ఆమెను సమీపించిన శివుడు, తన బిడ్డను పెంచేందుకు సిద్ధంగా ఉండమని చెప్తాడు. వాస్తవానికి తన భక్తురాలైన కూలివాక స్థితికి చలించిపోయిన పార్వతీదేవి, ఆ వనంలో శివుడిని స్వాగతం పలికేందుకు కూలివాక రూపంలో వస్తుంది. శివుడు, కూలివాక రూపంలో ఉన్న పార్వతీదేవి సంగమిస్తారు. వారికి మహిమన్వితుడైన కుమారుడు
జన్మిస్తాడు. ఆ కుమారుడిని తీసుకొని శివపార్వతులు కూలివాక ముందు ప్రత్యక్షమై ఆ బాలుడిని పెంచమని ఆమెకు అప్పగిస్తారు. కూలివాక పెంపకంలో కొన్నేళ్లు పెరిగిన ఆ బాలుడు తన నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు. ఆ క్రమంలో ఆ శివనందనుడు తన వాహనం గేదేపై కూర్చొని తనకిష్టమైన ఏళారా అనే శంఖాన్ని పూరిస్తూ శివదర్శనార్థం బయలుదేరుతాడు. కైలాసానికి వచ్చిన అతనికి లోనికి వెళ్లేందుకు అనుమతి లభించదు. అప్పుడు అతను విష్ణు రూపం ధరిస్తాడు. అలా శివనందనుడు విష్ణుమయుడిగా మారుతాడు. తన తల్లిదండ్రుల చెంతన ఉన్నప్పుడే విష్ణుమయుడు రాక్షసులైన భృంగ, జలంధరులను సంహరిస్తాడు. అతను చేసిన సత్కార్యాలు చూసిన అతనిని స్వర్గంలో నివసించమని కోరతారు. దానికి విష్ణుమయుడు తిరస్కరించి, తాను భూలోకంలో మనుషులతో కలిసి జీవిస్తానని
చెప్తాడు. ఈ మూర్తిని ఉత్తర కేరళలోని పంచనెల్లూరు కుటుంబం పూజిస్తోంది. తమ గ్రామాన్ని రక్షించాలని కోరుతూ భువనేశ్వరి దేవి గురించి వేలుముత్తప్పన్ స్వామి కఠోర తప్పస్సు చేస్తాడు. ఆ పరమభక్తుడి తపస్సుకు ప్రసన్నురాలైన భువనేశ్వరిదేవి అతని ముందు ప్రత్యక్షమై విష్ణుమనస్వామిని ప్రతిష్టించి భక్తితో పూజిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయమని ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి సూచనల ప్రకారమే నడుచుకుంటాడు వేలుముత్తప్పన్. ఓ శుభోదయాన ఆయనకు త్రిపయార్ నదిలో విష్ణుమయ స్వామి విగ్రహం లభిస్తుంది. దాన్ని తన ఇంటికి
తీసుకొని వస్తాడు. దాన్ని ఏం చేయాలని పంచనెల్లూరు కుటుంబాన్ని సంప్రదిస్తాడు. ఆ కుటుంబం పెద్ద
వేలుముత్తప్పన్‌కు మూలమంత్రం ఉపదేశిస్తాడు. ఎంతో నిష్ఠతో విష్ణుమయస్వామిని ఆరాధిస్తాడు. వెలిచపాడుకు చెందిన కొందరిని ఆయన తన విష్ణమయ అనుచరులుగా ఎంచుకుంటాడు. ప్రస్తుతమున్న మందిరాన్ని వేలుముత్తప్పన్ నిర్మించాడు. నాలుగు తరాలుగా ఆ మందిరం అలరారుతోంది. నేడు అది పెరింగొట్టుకర దేవస్థానంగా పేరుగాంచి భక్తుల కష్టాలు తీర్చే సన్నిధిగా నిలుస్తోంది.

Call Now
× Whatsapp Us
Visit Us On FacebookVisit Us On Youtube